[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-hyderabad-prominent-figures-appeared-at-the-ed-office-in-connection-with-the-betting-app-case":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":24,"published_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":99},3519,937,"hyderabad-prominent-figures-appeared-at-the-ed-office-in-connection-with-the-betting-app-case","Hyderabad: సెలబ్రిటీల చుట్టూ ఈడీ ఉచ్చు.. జాబితాలో ప్రముఖులు!..","బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రచారాల ద్వారా జరిగిన చెల్లింపులు, వాటి ఆర్థిక మార్గాలు, హవాలా కోణం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5bec39c9-4048-4098-9dee-dd89e840268f.jpg","Venu","telangana","routine",[18,19,20,21,22,23],"Hyderabad","ED case","betting app","promotion","Nidhhi Agerwal","celebritie","5 నిమిషాల పఠనం","2026-08-19T09:10:58+00:00",55,"\u003Cp>హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రచారాల ద్వారా జరిగిన చెల్లింపులు, వాటి ఆర్థిక మార్గాలు, హవాలా కోణం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్లపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం. \u003C\u002Fp>\u003Cp>ఇక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నిధి అగర్వాల్‌తో పాటు సుమారు 29 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లను ఈడీ రిపోర్ట్‌లో చేర్చినట్టు కథనాలు వస్తున్నాయి.. ప్రస్తుతం ఈ జాబితాలో నటుడు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్ల, మంచు లక్ష్మీ ఉన్నట్టు సమాచారం. అలాగే వీరితో పాటు ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం విచారణను ఎదుర్కొంటున్నారు. \u003C\u002Fp>\u003Cp>అదేవిధంగా  ఈడీ పలువురు ప్రముఖులకు ఇదివరకే నోటీసులు జారీ చేయగా, మరికొందరిని విచారణ నిమిత్తం పిలిపించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక చిన్న మొత్తంతో మొదలు పెట్టండి... ఒక్క రోజులోనే పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకోండి అంటూ యువతను ఆకర్షించే ఈ యాప్స్, మొదట్లో చిన్న విజయాలను చూపించి మరింత డబ్బు పెట్టేలా ప్రేరేపిస్తాయని నిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>ఒకసారి అలవాటుగా మారితే నష్టాలను పూడ్చుకోవాలనే ఆలోచనతో మరింత డబ్బు పెట్టడం, అప్పులు చేయడం, చివరకు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం జరుగుతోంది. తెలంగాణలో గతంలోనే ఇలాంటి విషాద ఘటనలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.. \u003C\u002Fp>\u003Cp>2025లో సిరిసిల్ల జిల్లాలోనూ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన 20 ఏళ్ల యువకుడు దాదాపు రూ.10 లక్షలు కోల్పోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు.. 2025 ఏప్రిల్‌లో తెలంగాణలో కేవలం నెల రోజుల్లోనే ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన ఆర్థిక నష్టాలతో ఏడు మరణాలు నమోదైనట్లు ఒక నివేదిక పేర్కొంది. \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"betting-app.jpg",[],{"title":33,"description":34},"సెలబ్రిటీల చుట్టూ ఈడీ ఉచ్చు.. జాబితాలో ప్రముఖులు!..","బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రచారాల ద్వారా జరిగిన చెల్లింపు",[36,44,52,58,66,72,78,83,89,93],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":26},"cong-meeting-in-800-cities","800 నగరాల్లో ‘స్టూడెంట్స్ గర్జన’.. మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరుబాట‌!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b3bf68e-76d0-4783-8a56-ba91ea34afe1.jpg","Kashi","9 నిమిషాల పఠనం","43 నిమిషాలు క్రితం",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":26},"road-accident-on-jurala-dam-three-injured","Jurala Dam Road Accident: జూరాల డ్యామ్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9faded0e-9c36-4c08-94f5-10be808f0f7b.jpg","NK","2 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":53,"title":54,"category":47,"image":55,"author":49,"read_time":56,"published_at":57,"public_read_count":26},"water-flow-increase-in-krishna-basin","Krishna Basin: కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న వరద ప్రవాహం.. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా నీరు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F23d7d45e-cc91-4ed4-8f50-b9fc752da657.jpg","3 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":49,"read_time":63,"published_at":64,"public_read_count":65},"tenth-student-search-in-youtube-nalgonda-sp-shocking-facts-in-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: యూట్యూబ్‌లో చూసి చోరీ, హత్య చేసిన టెన్త్ విద్యార్థులు.. ప్రిన్సిపాల్ హత్య కేసులో వెన్నులో వణుకుపుట్టించే నిజాలు","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0230b994-1a59-4837-b241-2fe4c75c995d.jpg","7 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",208,{"slug":67,"title":68,"category":61,"image":69,"author":49,"read_time":70,"published_at":71,"public_read_count":26},"police-reveal-shocking-facts-in-nalgonda-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు కారణం ఇదే- ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసులో సంచలన విషయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd061d4bb-0921-44a4-abad-47db1caf4fb6.jpg","6 నిమిషాల పఠనం","4 గంటలు క్రితం",{"slug":73,"title":74,"category":47,"image":75,"author":49,"read_time":76,"published_at":77,"public_read_count":26},"telangana-high-court-key-comments-on-free-welfare-schemes","Telangana High Court: ప్రజాధనాన్ని వృథా చేస్తే ఎలా? ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07d7f3f7-a40a-430c-9232-27c50ee0f7d2.jpg","4 నిమిషాల పఠనం","5 గంటలు క్రితం",{"slug":79,"title":80,"category":47,"image":81,"author":49,"read_time":24,"published_at":82,"public_read_count":26},"44-votes-on-one-address-im-mla-colony-after-sir-process","44 Votes: సారూ ఇదేనా \"సర్\"? ఒకే ఇంటి చిరునామాతో 44 ఓట్లు.. షాక్‌లో రాజకీయ పార్టీలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d91addb-52bf-44af-9b18-eff103906079.jpg","6 గంటలు క్రితం",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":49,"read_time":76,"published_at":88,"public_read_count":26},"group-1-big-scam-in-ysrcp-govt-cm-chandrababu-sensational-allegations","Cm Chandrababu: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారు-సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F653dc0b8-153a-487a-9bb0-9cc210e8099d.jpg","7 గంటలు క్రితం",{"slug":90,"title":91,"category":47,"image":92,"author":14,"read_time":24,"published_at":88,"public_read_count":26},"telangana-harish-rao-makes-sensational-comments-on-the-22-year-old-dispute","Telangana: 22 ఏ వివాదం పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7ac991bd-1727-4df8-a3ab-fb86935a99e7.jpg",{"slug":94,"title":95,"category":47,"image":96,"author":97,"read_time":24,"published_at":98,"public_read_count":65},"do-you-expect-us-to-take-bribes-when-we-ask-for-salaries-harish-rao-questions-revanths-government","జీతాలు అడిగితే లంచాలు తీసుకోమంటారా? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28c4ede3-03c0-455b-9e79-6123ee34a528.jpg","Mamatha puppala","8 గంటలు క్రితం",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]