[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-police-reveal-shocking-facts-in-nalgonda-principal-roopa-reddy-case":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":22,"published_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":30,"read_next":33,"sponsored_content":97},3536,945,"police-reveal-shocking-facts-in-nalgonda-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు కారణం ఇదే- ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసులో సంచలన విషయాలు","Principal Roopa Reddy: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రిన్సిపాల్ ని చంపింది అదే స్కూల్ కు చెందిన టెన్త్ విద్యార్థులే అని పోలీసులు నిర్ధారించారు.. డబ్బు కోసమే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ కేసు వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd061d4bb-0921-44a4-abad-47db1caf4fb6.jpg","NK","crime","routine",[18,19,20,21],"Principal Roopa Reddy","Nalgonda","Tenth Class Students","Swechaa News","6 నిమిషాల పఠనం","2026-08-19T15:07:22+00:00",55,"\u003Cp>Principal Roopa Reddy: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రిన్సిపాల్ ని చంపింది అదే స్కూల్ కు చెందిన టెన్త్ విద్యార్థులే అని పోలీసులు నిర్ధారించారు.. డబ్బు కోసమే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ కేసు వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(21, 128, 61);\">\u003Cstrong>డబ్బు ఉండటంతో విద్యార్థిని మందలించిన ప్రిన్సిపాల్\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆమె స్కూల్ లోనే చదువుతున్న విద్యార్థులే చంపేశారని ఎస్పీ తెలిపారు.\tకొండమల్లేపల్లిలోని రెండు వేర్వేరు తండాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రూపారెడ్డి ప్రిన్సిపాల్ గా ఉన్న స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నారు. ఇద్దరిలో ఒక విద్యార్థి హాస్టల్ లో ఉంటున్నాడు. ఆ విద్యార్థి దగ్గర కొంత డబ్బు, ఫోన్ గుర్తించిన వార్డెన్ రూపారెడ్డికి సమాచారం ఇచ్చాడు. ఆ విద్యార్థిని రూపారెడ్డి మందలించారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(21, 128, 61);\">\u003Cstrong>ప్రిన్సిపాల్ పై కక్ష పెంచుకున్నాడు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>దాంతో కక్ష పెంచుకున్నవిద్యార్థి మరో విద్యార్థితో కలిసి రూపారెడ్డి ఇంట్లో దోపిడీకి వెళ్లాడు. ఇది గమనించిన రూపారెడ్డి ఆ విద్యార్థిని గుర్తించి పేరు పెట్టి పిలిచి గట్టిగా కేకలు వేయడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో రూపారెడ్డిని కిరాతకంగా పొడిచి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత 2 లక్షల 20వేల డబ్బు, ఐఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు. విద్యార్థులు జల్సాలకు అలవాటు పడ్డారని పోలీసులు వెల్లడించారు. మద్యం తాగే అలవాటు ఉందన్నారు. దానికి అవసరమైన డబ్బు కోసం ప్రిన్సిపాల్ ఇంట్లో దొంగతనానికి వెళ్లారని పోలీసులు పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(21, 128, 61);\">\u003Cstrong>ప్రిన్సిపాల్ ఇంట్లో చోరీకి వెళ్లి..\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>''విద్యార్థి దగ్గర డబ్బు ఉండటం చూసి ప్రిన్సిపాల్ రూపారెడ్డి అతడిని నిలదీశారు. విద్యార్థి తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఆ విద్యార్థి రూపారెడ్డిపై కక్ష పెంచుకున్నాడు. స్కూల్ ఫీజుల వసూళ్ల గురించి తెలుసుకుని రూపారెడ్డి ఇంటికి దొంగతనానికి వెళ్లారు. విద్యార్థి మాస్క్ వేసుకుని రూపారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బు కోసం బెదిరించాడు. రూపారెడ్డి అతడిని గుర్తు పట్టింది. తన పేరు చెబుతుందనే భయంతో రూపారెడ్డిని హత్య చేశాడు. 27సార్లు రూపారెడ్డిని విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(21, 128, 61);\">\u003Cstrong>డబ్బులు ఎలా సంపాదించాలని యూట్యూబ్ లో వెతికారు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>డబ్బులు ఎలా సంపాదించాలని విద్యార్థులు యూట్యూబ్ లో వెతికారు. విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం రూపారెడ్డిని బెదిరించారు. రూపారెడ్డి నివాసం చుట్టుపక్కల 70 సీసీ కెమెరాలు చెక్ చేశాం. రూపారెడ్డి చివరిసారిగా తన పిన్నితో ఫోన్ లో మాట్లాడారు. ఆ సమయంలో బాబూ అని అన్నారు. రూపారెడ్డి బాబూ అని ఎవరిని పిలిచి ఉంటారో అనే కోణంలో విచారించాం. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(21, 128, 61);\">\u003Cstrong>మీ పిల్లలను నిత్యం గమనించండి\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థులు జల్సాలు చేస్తున్నారని మాకు సమాచారం అందింది. ఆ ఇద్దరిని విచారించాం. వారి దగ్గర రూ.1.54 లక్షల నగదు దొరికింది. విద్యార్థుల దొరికిన నగదుకు రక్తపు మరకలు ఉన్నాయి. తమ పిల్లలపైన, వారి ఫ్రెండ్స్ పైన పేరెంట్స్ ఓ కన్నేసి ఉంచాలి. తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లల తీరును గమనిస్తూ ఉండాలి'' అని నల్గొండ ఎస్పీ విజ్ఞప్తి చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[27],{"url":13,"name":28},"Roopa Reddy.jpg",[],{"title":31,"description":32},"Principal Roopa Reddy: చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు","రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రిన్సిపాల్ ని చ",[34,42,49,55,63,69,75,81,86,92],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":39,"read_time":40,"published_at":41,"public_read_count":24},"cong-meeting-in-800-cities","800 నగరాల్లో ‘స్టూడెంట్స్ గర్జన’.. మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరుబాట‌!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b3bf68e-76d0-4783-8a56-ba91ea34afe1.jpg","Kashi","9 నిమిషాల పఠనం","42 నిమిషాలు క్రితం",{"slug":43,"title":44,"category":45,"image":46,"author":14,"read_time":47,"published_at":48,"public_read_count":24},"road-accident-on-jurala-dam-three-injured","Jurala Dam Road Accident: జూరాల డ్యామ్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9faded0e-9c36-4c08-94f5-10be808f0f7b.jpg","2 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":50,"title":51,"category":45,"image":52,"author":14,"read_time":53,"published_at":54,"public_read_count":24},"water-flow-increase-in-krishna-basin","Krishna Basin: కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న వరద ప్రవాహం.. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా నీరు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F23d7d45e-cc91-4ed4-8f50-b9fc752da657.jpg","3 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":56,"title":57,"category":58,"image":59,"author":14,"read_time":60,"published_at":61,"public_read_count":62},"tenth-student-search-in-youtube-nalgonda-sp-shocking-facts-in-principal-roopa-reddy-case","Principal Roopa Reddy: యూట్యూబ్‌లో చూసి చోరీ, హత్య చేసిన టెన్త్ విద్యార్థులు.. ప్రిన్సిపాల్ హత్య కేసులో వెన్నులో వణుకుపుట్టించే నిజాలు","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0230b994-1a59-4837-b241-2fe4c75c995d.jpg","7 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",208,{"slug":64,"title":65,"category":45,"image":66,"author":14,"read_time":67,"published_at":68,"public_read_count":24},"telangana-high-court-key-comments-on-free-welfare-schemes","Telangana High Court: ప్రజాధనాన్ని వృథా చేస్తే ఎలా? ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F07d7f3f7-a40a-430c-9232-27c50ee0f7d2.jpg","4 నిమిషాల పఠనం","5 గంటలు క్రితం",{"slug":70,"title":71,"category":45,"image":72,"author":14,"read_time":73,"published_at":74,"public_read_count":24},"44-votes-on-one-address-im-mla-colony-after-sir-process","44 Votes: సారూ ఇదేనా \"సర్\"? ఒకే ఇంటి చిరునామాతో 44 ఓట్లు.. షాక్‌లో రాజకీయ పార్టీలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d91addb-52bf-44af-9b18-eff103906079.jpg","5 నిమిషాల పఠనం","6 గంటలు క్రితం",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":14,"read_time":67,"published_at":80,"public_read_count":24},"group-1-big-scam-in-ysrcp-govt-cm-chandrababu-sensational-allegations","Cm Chandrababu: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారు-సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F653dc0b8-153a-487a-9bb0-9cc210e8099d.jpg","7 గంటలు క్రితం",{"slug":82,"title":83,"category":45,"image":84,"author":85,"read_time":73,"published_at":80,"public_read_count":24},"telangana-harish-rao-makes-sensational-comments-on-the-22-year-old-dispute","Telangana: 22 ఏ వివాదం పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7ac991bd-1727-4df8-a3ab-fb86935a99e7.jpg","Venu",{"slug":87,"title":88,"category":45,"image":89,"author":90,"read_time":73,"published_at":91,"public_read_count":62},"do-you-expect-us-to-take-bribes-when-we-ask-for-salaries-harish-rao-questions-revanths-government","జీతాలు అడిగితే లంచాలు తీసుకోమంటారా? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28c4ede3-03c0-455b-9e79-6123ee34a528.jpg","Mamatha puppala","8 గంటలు క్రితం",{"slug":93,"title":94,"category":37,"image":95,"author":14,"read_time":67,"published_at":91,"public_read_count":96},"mobile-blast-in-delivery-boys-pocket-in-uttar-pradesh-aligarh","Mobile Blast: బాబోయ్.. బాంబులా పేలిన ఫోన్.. వ్యక్తికి తీవ్రగాయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec6dab81-bba7-4cbf-ad1b-c9519ecafe94.jpg",157,[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]