ఏపీ

Cm Chandrababu: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారు-సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు

రచన: NK19, ఆగ 20264 నిమిషాల పఠనం

వైసీపీ హయాంలో గ్రూప్-1 నిర్వహణ అతి పెద్ద స్కామ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్-1 పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. గ్రూప్-1 పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని ఆరోపించారు. నివేదికలు చూస్తే భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి పనులు చేస్తే ప్రతిభావంతులైన పిల్లలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

Cm Chandrababu: వైసీపీ హయాంలో గ్రూప్-1 నిర్వహణ అతి పెద్ద స్కామ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్-1 పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. గ్రూప్-1 పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని ఆరోపించారు. నివేదికలు చూస్తే భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి పనులు చేస్తే ప్రతిభావంతులైన పిల్లలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గ్రూప్-1 అక్రమాలపై చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

పేపర్లు దిద్దే బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలకు

'పేపర్లు దిద్దే బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడమే తప్పు. గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారు. కమిషన్ ఛైర్మన్ ఆమోదం లేకుండా అసలు ఏ పనీ చేయకూడదు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాల్సిన పనిని కార్మికులతో చేయించారు. ఇష్టానుసారంగా పేపర్లు దిద్దే అధికారం వీరికి ఎవరిచ్చారు? మార్కులు పెంచడం, తగ్గించడం.. ఇలా ఇష్టం వచ్చినట్లు చేశారు. తొలుత హైదరాబాద్ లో, రెండోసారి హాయ్ లాండ్ లో పేపర్లు దిద్దించారు.

అనర్హులతో పేపర్లు దిద్దించారు

ఏపీపీఎస్సీ నియమాలు, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. ప్రైవేట్ ఏజెన్సీకి ఎవాల్యుయేషన్ అప్పగించారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ ను హైదరాబాద్ లో చేయించారు. రెండో దశలో హాయ్ లాండ్ లో మేన్యువల్ ఎవాల్యుయేషన్ చేయించారు. హైదరాబాద్ లో ఎవాల్యుయేషన్ చేసిన వారిలో 25మంది అనర్హులు. రెండోసారి హాయ్ లాండ్ లో ఎవాల్యుయేషన్ చేసిన వారిలో 66మందీ అనర్హులే. 166 మంది ఎవాల్యూయేటర్లలో 50 మంది డిగ్రీ లెక్చరర్లను వినియోగించారు.

తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలి

గ్రూప్-1 జవాబు పత్రాల్లోని తప్పులను ఫ్లూయడ్ తో దిద్దకూడదు. 55 చోట్ల ఫ్లూయడ్ తో తప్పులు సరి చేశారు. కోర్టులను పక్కదారి పట్టించేందుకు అధికారులతో తప్పుడు అఫిడవిట్లు వేయించారు. 46వేల డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్పులు ప్రింట్ చేశారు. 97శాతం ఆల్టరేటింగ్ చేశారని సీఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పింది. ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలి. తప్పు చేసిన వారందరినీ శిక్షించే బాధ్యత మనందరిదీ' అని సీఎం చంద్రబాబు అన్నారు.

#Cm Chandrababu#Group 1#Andhra Pradesh#Ysrcp#AP Assembly#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తర్వాత చదవండి