National

Mobile Blast: బాబోయ్.. బాంబులా పేలిన ఫోన్.. వ్యక్తికి తీవ్రగాయాలు

రచన: NK19, ఆగ 20264 నిమిషాల పఠనం

ఫోన్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. సడెన్ గా బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అలీగఢ్ లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతిలో ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

Mobile Blast: ఈరోజుల్లో ఫోన్లు అందరి జీవితాల్లో ఒక భాగమైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నిత్యవసర వస్తువు జాబితాలోకి మొబైల్ కూడా వచ్చేసింది. అన్ని పనులు ఇప్పుడు ఫోన్ లోనే అయిపోతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ చాలా కీలకంగా మారింది. అయితే, ఈ ఫోన్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. సడెన్ గా బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అలీగఢ్ లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతిలో ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ఫోన్ తీస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్

బాధితుడి పేరు సచిన్. ప్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అతడికి కాల్ వచ్చింది. దాంతో జేబులో నుంచి ఫోన్ బయటకు తీస్తుండగా అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో అతడి ముఖం, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పేలిన ఫోన్ మోటరోలా కంపెనీకి చెందినదిగా బాధితుడి కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, ఆ ఫోన్ అలా పేలిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఫోన్లా? బాంబులా?

ఫోన్ పేలిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఫోన్ బ్లాస్ట్ అందరినీ షాక్ కి గురిచేస్తోంది. కాగా, వారం క్రితం నోయిడాలోనూ ఓ ఫోన్ పేలిపోయింది.

ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతుండటం మొబైల్ వినియోగదారులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఫోన్ల భద్రతపై అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జేబులో బాంబు పెట్టుకుని తిరిగినట్లు ఉందనే ఆందోళన కనిపిస్తోంది.

ఫోన్ల భద్రతపై అనుమానాలు

ఫోన్ తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఈ ఘటనలే నిదర్శనం. కాగా ఫోన్ ఓవర్ హీట్ కావడం వల్ల, నాసిరకం చార్జర్లు వాడటం వల్ల, బ్యాటరీ సమస్యల వల్ల ఇలా పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ బాగా వేడెక్కిన పరిస్థితుల్లో దాన్ని వాడకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అతిగా ఫోన్ వాడకం, ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల ఫోన్ వేడెక్కి కూడా ఇలాంటి పరిస్థితులకు దారితీయొచ్చని నిపుణులు వివరించారు. అలాగే నాసిరకం ఫోన్లకు, చార్జర్లకు దూరంగా ఉండాలని కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. మొత్తంగా బ్రాండెడ్ అయినా, అన్ బ్రాండెడ్ అయినా.. అతి ఫోన్ వాడకం ప్రాణాలకే ప్రమాదం.

#Mobile Blast#Phone Blast#Uttar Pradesh#Aligarh#Swechaa News#Mobile Explode#Phone Explode
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తర్వాత చదవండి