Jurala Dam Road Accident: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రాజెక్టుకు సమీపంలోని నందిమల్ల నుంచి డ్యాం మీదుగా ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు గద్వాలకు ప్రయాణిస్తున్నారు. జూరాల డ్యామ్ పై ఉన్న భారీ స్పీడ్ బ్రేకర్ ను గమనించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని షాద్ నగర్ వాసులుగా గుర్తించారు. గమనించిన స్థానికులు 108 కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
Jurala Dam Road Accident: జూరాల డ్యామ్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
రచన: NK•19, ఆగ 2026•2 నిమిషాల పఠనం
Jurala Dam Road Accident: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రాజెక్టుకు సమీపంలోని నందిమల్ల నుంచి డ్యాం మీదుగా ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు గద్వాలకు ప్రయాణిస్తున్నారు. జూరాల డ్యామ్ పై ఉన్న భారీ స్పీడ్ బ్రేకర్ ను గమనించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడింది.
#Jurala Dam#Road Accident#Bike#Three Injured#Jurala Project Bridge#Swechaa News











