తెలంగాణ

Hyderabad: సెలబ్రిటీల చుట్టూ ఈడీ ఉచ్చు.. జాబితాలో ప్రముఖులు!..

రచన: Venu19, ఆగ 20265 నిమిషాల పఠనం

బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రచారాల ద్వారా జరిగిన చెల్లింపులు, వాటి ఆర్థిక మార్గాలు, హవాలా కోణం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్నారు.

మరోవైపు బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రచారాల ద్వారా జరిగిన చెల్లింపులు, వాటి ఆర్థిక మార్గాలు, హవాలా కోణం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్లపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం.

ఇక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నిధి అగర్వాల్‌తో పాటు సుమారు 29 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లను ఈడీ రిపోర్ట్‌లో చేర్చినట్టు కథనాలు వస్తున్నాయి.. ప్రస్తుతం ఈ జాబితాలో నటుడు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్ల, మంచు లక్ష్మీ ఉన్నట్టు సమాచారం. అలాగే వీరితో పాటు ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం విచారణను ఎదుర్కొంటున్నారు.

అదేవిధంగా ఈడీ పలువురు ప్రముఖులకు ఇదివరకే నోటీసులు జారీ చేయగా, మరికొందరిని విచారణ నిమిత్తం పిలిపించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక చిన్న మొత్తంతో మొదలు పెట్టండి... ఒక్క రోజులోనే పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకోండి అంటూ యువతను ఆకర్షించే ఈ యాప్స్, మొదట్లో చిన్న విజయాలను చూపించి మరింత డబ్బు పెట్టేలా ప్రేరేపిస్తాయని నిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఒకసారి అలవాటుగా మారితే నష్టాలను పూడ్చుకోవాలనే ఆలోచనతో మరింత డబ్బు పెట్టడం, అప్పులు చేయడం, చివరకు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం జరుగుతోంది. తెలంగాణలో గతంలోనే ఇలాంటి విషాద ఘటనలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది..

2025లో సిరిసిల్ల జిల్లాలోనూ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన 20 ఏళ్ల యువకుడు దాదాపు రూ.10 లక్షలు కోల్పోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు.. 2025 ఏప్రిల్‌లో తెలంగాణలో కేవలం నెల రోజుల్లోనే ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన ఆర్థిక నష్టాలతో ఏడు మరణాలు నమోదైనట్లు ఒక నివేదిక పేర్కొంది.

#Hyderabad#ED case#betting app#promotion#Nidhhi Agerwal#celebritie
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తర్వాత చదవండి