తెలంగాణ

22A Lands: స్వేచ్ఛ ఎఫెక్ట్.. 22ఏ వివాదం.. తప్పు ఒప్పుకున్న మంత్రి పొంగులేటి

రచన: NK17, ఆగ 20268 నిమిషాల పఠనం

22A Lands: నిషేధిత భూముల (Section 22-A) అంశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు ఒప్పుకున్నారు. 22ఏ భూముల వివాదంపై గత వారం రోజులుగా స్వేచ్ఛ అనేక కథనాలు రాసింది. 22ఏ పై స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల బీబీసీకి కూడా ఆర్టికల్ ఇచ్చారు. ఈ కథనాలతో రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్వయంగా మంత్రి పొంగులేటి రంగంలోకి దిగారు. 22-A భూముల అంశంపై ఉదయం నుంచి సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. అనంతరం తప్పు జరిగినట్లు ప్రెస్ మీట్‌లో ఆయన ఒప్పుకున్నారు.

22A Lands: నిషేధిత భూముల (Section 22-A) జాబితా అంశంలో పొరపాటు జరిగినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు ఒప్పుకున్నారు. 22ఏ భూముల జాబితా వివాదంపై గత వారం రోజులుగా స్వేచ్ఛ అనేక కథనాలు రాసింది. ప్రైవేట్ ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో చేర్చిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. భూ బాధితులకు స్వేచ్ఛ అండగా నిలబడింది. వారి వాయిస్ ను బలంగా వినిపించింది.

నిషేధిత భూముల జాబితా అప్ డేట్ లో పొరపాట్లు జరిగాయని వరుసగా కథనాలు ఇచ్చింది. 22ఏ పై స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల బీబీసీకి కూడా ఆర్టికల్ ఇచ్చారు. ఈ కథనాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్వయంగా మంత్రి పొంగులేటి రంగంలోకి దిగారు. 22-A భూముల అంశంపై ఉదయం నుంచి సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. అనంతరం తప్పు జరిగినట్లు ప్రెస్ మీట్‌లో ఆయన ఒప్పుకున్నారు.

అధికారుల తప్పిదమే.. క్షమించండి..

22A నిషేధిత భూముల జాబితాపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. నిషేధిత జాబితా అప్‌డేట్ చేయడంలో పొరపాటు జరిగిందని ఆయన అంగీకరించారు. పొరపాటున కొందరు ప్రైవేట్ వ్యక్తుల భూములు 22A నిషేధిత భూముల జాబితాలో పడ్డాయని, ఇది మా అధికారుల తప్పిదమే అని ఒప్పుకున్న మంత్రి.. భూ బాధితులకు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఎవరి భూములను లాక్కోదని మంత్రి హామీ ఇచ్చారు. 22A నిషేధిత లిస్టులో చేర్చిన భూముల్లో న్యాయబద్దమైన వాటిని పరిశీలించి లిస్టు నుంచి త్వరలోనే తొలగిస్తామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.

మొత్తం 750 దరఖాస్తులు వచ్చాయి

''ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. తమ ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత భూముల లిస్టులో పెట్టారని మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి 750 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువగా మేడ్చల్ నుంచి 511, రంగారెడ్డి జిల్లాలో 148 అప్లికేషన్లు వచ్చాయి. అల్విన్ కాలనీలోనూ ప్రైవేట్ వ్యక్తుల భూములు 22Aలో పడ్డాయి. సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు సమీక్ష చేస్తాం. కొందరు ప్రైవేట్ వ్యక్తుల భూములు 22A నిషేధిత భూముల జాబితాలో పడ్డాయని గుర్తించాము. ముమ్మాటికీ ఇది మా అధికారుల తప్పిదమే. అధికారుల తరపున నేను క్షమాపణలు చెబుతున్నా. దీనిపై ఉన్నతాధికారులతో కమిటీ వేస్తాం. ప్రతి దరఖాస్తును కమిటీ పరిశీలించి సమస్యను పరిష్కరిస్తుంది'' అని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

ఉదయం నుంచి అధికారులతో కీలక సమీక్ష

22ఏ నిషేధిత భూముల అంశం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 22ఏ పేరుతో సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనంపై ‘స్వేచ్ఛ’ గత వారం రోజులుగా అనేక కథనాలు రాసింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ కథనాలు ప్రచురించింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే సమీక్షకు ఆదేశించారు. సచివాలయంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు

22ఏను ఒక భూతంగా చూపిస్తూ ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు మంత్రి పొంగులేటి. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పడం, కావాలని జాప్యం చేయడం, చిన్న సమస్యను పెద్దదిగా మార్చడం ఇకపై కుదరదని తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం అధికారులుగా మీ ప్రాథమిక బాధ్యత అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్ల వారీగా వస్తున్న దరఖాస్తులు, వాటి పెండింగ్ కారణాలు, పరిష్కార గడువులపై ఆయన లోతుగా విచారించారు.

కేవలం నిషేధిత జాబితాలో భూమి ఉందనే ఒకే ఒక్క కారణంతో దరఖాస్తులను తిరస్కరించవద్దని చెప్పారు. అసలు ఆ భూమి ఆ జాబితాలోకి ఎలా వచ్చిందో పరిశీలన చేయాలన్నారు. సంబంధిత రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను సమగ్రంగా తనిఖీ చేశాకే నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. నిజమైన భూ యజమానులకు న్యాయం చేస్తూనే, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలన్నారు. ఇక, త్వరలోనే భూ సమస్యలపై బాధితుల ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక 'టోల్ ఫ్రీ నెంబర్'ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

#22A Lands#Ponguleti Srinivasa Reddy#Swechaa News#Swechaa Effect#22A Prohibited List
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తర్వాత చదవండి